ఎన్నికలకు ముందు ఎల్.ఆర్.ఎస్ భూముల క్రమబద్ధీకరణ, తదితర ఉచిత హామీలు ఇచ్చి మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా బీ.ఆర్.ఎస్ పార్టీ పిలుపు మేరకు రామగుండం శాసనసభ్యులు బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అదేశాల మేరకు బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎల్.ఆర్.ఎస్ భూముల క్రమబద్ధీకరణ, తదితర ఉచిత హామీలు ఇచ్చి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్రజలను మభ్యపెడుతుందన్నారు.
సామాన్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఆరు గ్యారెంటీలను సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ కు పార్టీ శ్రేణులు వినతిపత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో కార్పోరేటర్ కల్వచర్ల కృష్ణవేణీ, జనగామ కవిత సరోజిని నాయకులు బోడ్డుపల్లి శ్రీనివాస్, తోట వేణు, నిజామెాద్దీన్, పిల్లి రమేష్ తోకల, రమేష్, నూతి తిరుపతి అచ్చేవేణు, దొమ్మేటి వాసు, మేతుకు దేవరాజ్,అడ్లూరి రాములు, తిమెాతి కిరణ్ జీ, అల్లం అయిలయ్య, గుర్రం పద్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.