Friday, April 11, 2025
HomeతెలంగాణGodavarikhani: దసరా వేడుకలు

Godavarikhani: దసరా వేడుకలు

సరదాగా దసరా..

గోదావరిఖనిలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి ఆర్ జీ.వన్ ఏరియా ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ వేడుకలను ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటున్నామని, రామగుండం నియోజకవర్గంలోని ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారి దయ అందరిపై ఉండాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక పై కళాకారుల భక్తి గీతాలు,సంగీత నృత్యలు పాటలు ఎంతో ఆకట్టుకున్నాయి.ఆ తర్వాత వివిధ రకాల బాణా సంచా వెలుగులు ఉత్సవాలకు మరింత శోభాయమానంతో ఆకర్షించాయి. రావణ వద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, వారి సతీమణి మనాలి ఠాగూర్, కోయ శ్రీహర్ష, మంచిర్యాల్ జిల్లా కలెక్టర్, ఆర్జీవన్ జిఎం. లలిత్ కుమార్, మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు, ఎన్టిపిసి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News