Saturday, July 6, 2024
HomeతెలంగాణGodavarikhani: హరీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

Godavarikhani: హరీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

అన్నదానం, రక్త దాన శిబిరం

హెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల్ల హరీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా రామగుండం టీం సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు కీర్తిశేషులు అబ్బొజు రాంబాబు కుమారుని ఉన్నత చదువుల నిమిత్తం ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా వార్షిక ఫీజు రూ.30,000 హరీష్ రెడ్డి తండ్రి వ్యాల్ల రాంరెడ్డి చేతుల మీదుగా అందించారు. అలాగే 33వ డివిజన్ అంగన్వాడి సెంటర్లో ఎయిర్ కూలర్, 32వ డివిజన్, 18వ డివిజన్ లో ఎయిర్ కూలర్ తో పాటు చిన్నారులకు చైర్స్ ను అందిచ్చారు. దానితో పాటు గోదావరిఖని ప్రభుత్వ వైద్యశాలలో రోగుల కోసం అన్నదాన కార్యక్రమం, అలాగే రక్త దానం శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో ఫౌండేషన్ రామగుండం టీం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానాన్ని చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వీహెచ్ఆర్ ఫౌండేషన్ రామగుండం టీం సభ్యులు, హరీష్ రెడ్డి తండ్రి వాళ్ళ రాంరెడ్డి, జగిత్యాల జిల్లా ముంజంపల్లి, విహెచ్ఆర్ టీం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News