Saturday, July 6, 2024
HomeతెలంగాణGodavarikhani: 1 రూపాయికే వైద్యం

Godavarikhani: 1 రూపాయికే వైద్యం

డాక్టర్ దామెర అనిల్ కుమార్ కు సన్మానం

పేదలకు అందుబాటులో తన వైద్యం సేవలు ఉంటాయని 1 రూపాయికే వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ ను 40 వ డివిజన్ అద్యక్షులు చల్లా రవీందర్ రెడ్డి అద్వర్యంలో స్థానిక మార్కండేయకాలనీ లోని స్టార్ మౌంట్ హాస్పిటల్ లో డాక్టర్ దామెర అనిల్ కుమార్ ను శాలువాలతో సత్కరించి, పూల బోకెను అందించి మాట్లాడారు.
రామగుండం కార్పొరేషన్ 40 వ డివిజన్ లోని స్టార్ మౌంట్ హాస్పిటల్ వారు ప్రతి ఆదివారం ఒక్క రూపాయికే వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ దామేర అనిల్ కుమార్, హాస్పిటల్ మేనేజ్మెంట్ రాజేందర్ ల సేవాస్పూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 40 వ డివిజన్ నాయకులు గంట సత్తయ్య, ఆయిల్ల నాగరాజు, కక్కెర్ల సతీష్ బాబు, చేపూరి శ్రీనివాస్, బండారి సంతోష్, చల్ల మణికంఠ రెడ్డి, నమిల మొగిలి, జలీల్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News