అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ఆర్.కె. గార్డెన్ లో ముందస్తు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ నారీ శక్తివందన్ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ చేశారు. రామగుండం బిజెపి మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతు.. మహిళ మహా శక్తి స్వరూపిణీ ప్రపంచంలో సగభాగానికి పైగా మహిళలే ఉన్నారని, ఎన్నోరంగాల్లో ముందుండి స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించి తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. మారుతున్న కాలనికి అనుకూలంగా మహిళలు చైతన్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు.
ప్రధాని మోదీ మహిళా సంఘాలకు రుణ సౌకర్యం, మహిళలకు ప్రత్యేక పథకాలు అమలు పరుస్తున్న తీరును క్షేత్రస్థాయిలో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ వేడుకలలో మహిళలు వివిధ “ఫన్ గేమ్స్”లలో పోటీ చేసి బహుమతులను గెలుచుకున్నారు.
ఈ కార్యక్రమం లో బి.జె.పి. స్టేట్ కౌన్సిల్ మెంబర్ మెరుగు హనుమంతు గౌడ్ , వడ్డేపల్లి రాంచందర్, పెద్దపల్లి రవీందర్, చంద్రశేఖర్, తోట కుమారస్వామి, బొడకుంట జనార్ధన్, బాణాల స్వామి, కొమ్మల స్వామి, రవి చరణ్, మహావాది రామన్న, నవీన్ గౌడ్, పైతరి రాజు, అధిక సంఖ్యలో మహిళళు పాల్గొన్నారు.