Saturday, November 23, 2024
HomeతెలంగాణGodavarikhani: నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన

Godavarikhani: నామినేషన్ల ఏర్పాట్ల పరిశీలన

మూడంచెల పటిష్ట బందోబస్తు

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడు అంచెల పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు రామగుండము పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్ తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నామినేషన్స్ ప్రక్రియలో చేయవలసిన భద్రత ఏర్పాట్లను, ఎంట్రెన్స్, ఎగ్జిట్ దారులు, పార్కింగ్ ఏర్పాటు, మీడియా పాయింట్ ఏర్పాట్లలను పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సి.పి. మాట్లాడుతూ..లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, రిటర్నింగ్ అధికారి చాంబర్ ను సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని దానికోసం సెంట్రల్ ఫోర్స్, అర్ముడ్, సివిల్ ఫోర్స్ తో మూడు అంచెలా భద్రత ఏర్పాట్లు చేసామనీ సి.పి తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ పరంగా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యాక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, ఎస్ఐ లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News