రాహుల్ గాంధీ 54వ జన్మదినం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ హాజరై స్థానిక ప్రధాన చౌరస్తాలో కేక్ కట్ చేశారు. అనంతరం అనాధ పిల్లల ఆశ్రమంలో అన్న దానం చేశారు.
ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు నాలుగు వేల కిలోమటర్ల భారత్ జోడో యాత్ర ద్వారా దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటా అని దైర్యన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు అని అన్నారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని, అవినీతి బారస ప్రభుత్వాన్ని గద్దెదించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని వారు కోరారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ని భారత దేశ ప్రధాని గా చూడాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్, మహంకాళి స్వామి, బొమ్మక రాజేష్ , తిప్పారపు శ్రీనివాస్, ఎండీ ముస్తఫా , ఫక్రొద్దిన్, పెండ్యాల మహేష్ , గట్ల రమేష్ పాతపల్లి రవి,చుక్కల శ్రీనివాస్, నగునూరి రాజు, తాల్లపెళ్లి యుగెందర్, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్, ధూళికట్ట సతీష్ , పంజా శ్రీను, కళ్యాణ్ , కీర్తి నాగరాజు , దశరతం,సది, రమేష్ , మిదిదొడ్డి ప్రవీణ్, శివ,కల్వల రంజిత్. యూత్ కాంగ్రెస్ నాయకులు అడప సాయి కిరణ్, రాముకుమార్, డాన్ శ్రీను, దాసరి విజయ్, ఉదయ్ రాజ్, బైరిమల్ల దుర్గా ప్రసాద్, వంశీ, నాని, మరియు మనోహర్ రెడ్డి ,జాలి శ్రీనివాస్ రెడ్డి, మాలెం శంకర్ ,శివాజీ, తదితరులు పాల్గొన్నారు.