Saturday, November 23, 2024
HomeతెలంగాణGodavarikhani: కమిషనరేట్ ఆఫీస్ లో జాతీయ జెండాను ఎగరవేసిన సిపి

Godavarikhani: కమిషనరేట్ ఆఫీస్ లో జాతీయ జెండాను ఎగరవేసిన సిపి

ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుని పని చేయాలన్న సీపీ

రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఎగురవేశారు. సిపి ఆఫీసులో పోలీస్ కమీషనర్ రెమారాజేశ్వరి ఐపిఎస్ డిఐజి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని పతాకానికి అందిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. నూతన కమిషనరేట్ పోలీస్ కార్యాలయ భవనం ప్రారంభం చేసిన తర్వాత స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం మొదటిసారని భవిష్యత్తులో కూడా ఈ కమిషనరేట్ లో పని చేసెటువంటి అధికారులు కూడా చాలా గొప్పగా పని చేస్తూ వాళ్ళ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ లో మంచి విజయo సాధించాలని, గొప్ప పురోగతి పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నానని సిపి తెలిపారు. కమిషనరేట్ పరిధిలో చేస్తున్నటువంటి ప్రతి ఒక అధికారికి కూడా వృత్తి నిబద్దతతో, మంచి అభిరుచితో పనిచేస్తున్నారన్నారు. ఎన్నో చాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణతో సమాజానికి, ప్రజలకు సేవ చేయాలనే మంచి స్పూర్తి తో మంచిగా కష్టపడి చాలా బాగా పనిచేస్తున్నారని అందరికి అభినందనలు తెలిపారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మన యొక్క అభివృద్ధి పరంగా చూస్తే ఒక వ్యక్తి యొక్క అబివృద్ది ఎలాగో ఉందో దాన్ని బట్టి దేశ అబివృద్ది ఉంటుంది అన్నారు. ప్రతి ఒక వ్యక్తి వ్యక్తిగత బాద్యత తీసుకోని ప్రతి ఒక్కరూ ఫిజికల్ గా మెంటల్ గా బాగుండాలని ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలని వృత్తి పరమైన గ్రోత్, సంతోషం ను జీవితం లో బాగం చేసుకోవాలన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంపిక కాబడి యూనిఫామ్ వేసుకున్నాక మన లైఫ్ స్టైల్ మారిపోతుందన్నారు. వ్యక్తిగత జీవితంలో చాలా త్యాగాలు చేస్తూ ఈ డిపార్ట్మెంట్లో పని చేస్తాం అని, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అధికారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకుని పని చేయాలన్నారు. కొత్త గా రిక్రూట్మెంట్ అయిన అధికారులు , సిబ్బంది ఎంబీఏ ఎంసీఏ చదివిన వాళ్లు చాలామంది ఉన్నారు ఆదునిక సాంకేతిక టెక్నాలజీని ఉయోగిస్తూ చేస్తూ విధులు నిర్వహించాలన్నారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈరోజు మనందరం స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవిస్తున్నామని , మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొవాలని ఈ కార్యక్రమానికి చాలా మంది పిల్లలు, కుటుంబ సబ్యులు వచ్చారు వారికీ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారణం ఎందరో మంది మహనీయుల ప్రాణత్యాగమని చేశారని అవ్రి గురించి తెలియచేయాలి అన్నారు. 2022 సంవత్సరంలో విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 సిబ్బంది కి కఠిన సేవా పతకం -01, అంత్రిక్ సురక్ష పతకం -03, అతి ఉతకృష్ట పతకం -18, ఉతకృష్ట పతకం -03 మొత్తం 25 మందికి సీపీ అందించారు.
ఈ కార్యక్రమం లో ఏఆర్ అడిషనల్ డీసీపీ రియాజ్ హుల్ హాక్, గోదావరిఖని ఎసిపి తులా శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు ,స్పెషల్ బ్రాంచ్, సిసిఅర్బి, టాస్క్ ఫోర్సు ఇన్స్పెక్టర్స్, సిఐ లు ఆర్ఐ లు, సిపిఓ, ఎఆర్ సిబ్బంది,స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News