సింగరేణి మాజీ డైరెక్టర్, సింగరేణి రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జె. వి. దత్తాత్రేయులు కోల్ కత్తాలో కోల్ఇండియా చైర్మన్ పి.ఎం.ప్రసాద్ ను కలిసి రిటైర్డ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. కోల్ మైన్స్ పెన్షన్ పెంపుదల సమస్యను కేంద్ర బొగ్గు శాఖా మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళాలని, పెన్షన్ ఫండ్ కు అమ్మే ప్రతి టన్నుకు విరాళం పెంచాలని, 2018 లో సీఎంపీఎఫ్ బోర్డ్ ట్రస్ట్ సమావేశంలో సబ్ కమిటీ సిఫార్స్ లను అమలు పరచాలని, కోల్ మైన్స్ పెన్షన్ స్కీం-1998 ప్రకారం వితంతువు పింఛను అవాంతరాలు లేకుండ నూతన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ జారీ చేయాలని, బొగ్గు పెన్షనర్ల సమస్యలను ప్రస్తావించడానికి కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ వారి బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ లో ఫెడరేషన్ ఆఫ్ కోల్ ఇండస్ట్రీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని ,70,75 సంవత్సరాలు నిండి పదవి విరమణ పొందింన వయోవృద్ధులకు ఒఎన్జిసి, ఇతర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఒకే మొత్తంలో అమలు చేస్తున్న ఫెలిసిటేషన్ పథకాన్ని బొగ్గు పెన్షనర్లకు అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోల్ ఇండియా మాజీ చైర్మన్ ఆర్ బి ఉపాధ్యాయ, బిమన్ మిత్ర ఇతర ఫెడరేషన్ ఆఫ్ కోల్ ఇండియా రిటైర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.