తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విజయోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలో వరంగల్, హనుమకొండ, ఖాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ (Warangal) మహానగర అభివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ 4962.47 కోట్లు కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొన్ని విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసింది. విజయోత్సవాలలో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేస్తూ తెలంగాణ సర్కార్ వరుసగా ఉత్తర్వులు జారీ చేసింది.
నిధుల కేటాయింపులు ఇలా…
వరంగల్ (Warangal) అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు.
మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ. 205 కోట్లు.
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం రూ.160.92 కోట్లు.
టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాల కోసం రూ 33.60 కోట్లు.
టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇళ్ళు, రూ. 43.15 కోట్ల పరిహారం.
కాళోజీ కళాక్షేత్రానికి రూ.85 కోట్లు.
పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ కోసం రూ. 65 కోట్లు.
నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ 8.3 కోట్లు.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కు రూ. 32.50 కోట్లు.
ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ.80 కోట్లు.
భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.28 కోట్లు.
గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల కోసంరూ.49.50 కోట్లు.