Saturday, November 23, 2024
HomeతెలంగాణGroup 1 from 21st: 21 నుంచి గ్రూప్-1 పరీక్షలు

Group 1 from 21st: 21 నుంచి గ్రూప్-1 పరీక్షలు

అప్డేట్..

హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 21 నుంచి జరగనున్న గ్రూప్ -1 పరీక్షలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మొత్తం ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 5613 మంది హాజరుకానున్నట్లు తెలిపారు.

- Advertisement -

పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల హాల్ టికెట్లు ప్రస్తుతం ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చునని కలెక్టర్ సూచించారు. మొదటి పరీక్ష కు ఉపయోగించిన హాల్ టికెట్ నే అభ్యర్థులు
మిగిలిన ఆరు పరీక్షలకు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. హాల్ టికెట్లను ఈ నెల 14 నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థి ఫోటోగ్రాఫ్ మరియు సంతకం యొక్క ముద్రించిన చిత్రాలు స్పష్టంగా ఉన్నట్లయితే మాత్రమే ఈ హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. దీన్ని నిర్ధారించుకోవడానికి, లేజర్ ప్రింటర్‌తో A4 సైజు కాగితంపై ముద్రించిన హాల్ టిక్కెట్‌ను తీసుకురావాలని, ఉత్తమంగా తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ ను పరీక్షా కేంద్రానికి వచ్చే ముందు ప్రింటెడ్ హాల్ టికెట్‌లోని నిర్దేశిత స్థలంలో అతికించాలని లేకుంటే అభ్యర్థి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుందని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్‌పై ముద్రించిన సూచనలను తప్పకుండా చదవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News