తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న ‘గృహలక్ష్మి’ పథకం కోసం దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. ఇల్లు లేని అర్హులంతా గృహలక్ష్మి పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకుని దరఖాస్తులు సమర్పిస్తున్నారు. మల్లాపూర్ లో దరఖాస్తుల కోసం ప్రజలు పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. దరఖాస్తులు సమర్పించడానికి వచ్చిన వారిపై మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తామిచ్చిన అప్లికేషన్ కు రిసిప్ట్ ఇవ్వమని అడగగా కోపోద్రిక్తులైన అధికారి మీరు ఎవ్వరికి చెబుతారో చెప్పుకోండి.. కలెక్టర్ కు పిర్యాదు చేస్తారో.. ఏమైనా..చేసుకోండి.. ఎవ్వరికి చెప్పినా ఏం చేసినా ఏంకాదు అని జర్నలిస్ట్ లపై, ప్రజలపై దుర్భాషలాడుతూ, చిందులేశాడు. ప్రభుత్వం ఇచ్చినదే తక్కువ సమయం ఉన్న తక్కువ సమయంలో నానా ఇబ్బందులు, తంటాలు పడి దరఖాస్తు ఇవ్వబోతే అధికారి ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడంపై మండల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అధికారి తీరు మార్చుకోవాలని లేకపోతే అతన్ని విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.