Monday, April 7, 2025
HomeతెలంగాణGudem Mahipal: మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

Gudem Mahipal: మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

ఇన్ఫ్రా అభివృద్ధికి పెద్ద పీట

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మల్లికార్జున హిల్స్, బ్యాంక్ కాలనీ, వంధనపురి కాలనీలలో కోటి 20 లక్షల రూపాయల సొంత నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులతోపాటు జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.

- Advertisement -

సీఎం కేసీఆర్ ఇటీవల పటాన్చెరు బహిరంగ సభలో ప్రకటించిన 25 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ మంజూరు అయ్యాయని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News