Sunday, November 16, 2025
HomeతెలంగాణGudem Mahipal Reddy: గ్రామీణ రోడ్లకు మహర్దశ

Gudem Mahipal Reddy: గ్రామీణ రోడ్లకు మహర్దశ

ప్రభుత్వం అందించే నిధులతో పాటు సీఎస్ఆర్ సహకారంతో గ్రామీణ రోడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం శివనగర్ గ్రామంలో టిఎస్ఐఐసి సహకారంతో రూ. 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిన్నారం మండలానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని, వీటి ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు గ్రామాల మధ్య అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad