బీఆర్ ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల పరిధిలోని కానుకుంట గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం సభ్యులు భారీ సంఖ్యలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హాజరైన స్థానిక ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.