Saturday, November 15, 2025
HomeతెలంగాణHanuman Sobhayatra: హనుమాన్ శోభాయాత్రలో సండ్ర

Hanuman Sobhayatra: హనుమాన్ శోభాయాత్రలో సండ్ర

సత్తుపల్లిలో మెట్ట ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హన్‌మాన్‌ శోభయాత్ర జై శ్రీరామ్‌.. జైజై శ్రీరామ్‌ నినాదాలతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. శోభాయమానంగా జరిగిన శోభాయాత్రలో సండ్ర పాల్గొన్నారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో, దీక్ష మాలను చేపట్టిన హనుమాన్ దీక్షాపరులతో, నిలువెత్తు హనుమాన్‌ జెండాలతో నిర్వహించిన ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. ప్రత్యేక వాహనాలపై తెలంగాణ సంస్కృతి చిహ్నంగా జై హనుమాన్ బతుకమ్మ, హనుమంతుని గథా, నిలువెత్తు హనుమంతుని విగ్రహ కటౌటు, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, రాముని వేషధారణలు నృత్యాలు, భజనలు, కీర్తనలు, కోలాటాలు,మిరమిట్లు గొలుపే రంగురంగుల లైట్లు, డీజే పాటలు శోభాయాత్రలో ఆకట్టుకున్నాయి. యువకులతో పాటు మహిళలు జై హనుమాన్, జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad