Saturday, November 15, 2025
HomeతెలంగాణHarish Rao : 6,200 పాఠశాలలను మూసివేసే కుట్ర

Harish Rao : 6,200 పాఠశాలలను మూసివేసే కుట్ర

6,200 పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతీ చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతీ రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో ప్రగల్భాలు పలికింది అన్నారు. కానీ, అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే జీరో స్కూల్ పేరిట 1,899 స్కూల్ లు, 10 మంది లోపు విద్యార్థులు 4,314 స్కూల్లు మొత్తం కలిపి 6,213 స్కూళ్ళని శాశ్వతం గా మూసి వేసే ప్రణాళిక లో భాగంగానే ఆ స్కూల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కొరకు 7,289 కోట్లతో మన ఊరు – మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్న బియ్యంతో పౌష్ఠిక ఆహారం అందించారని హరీష్ రావు (Harish Rao) అన్నారు. రేవంత్ సర్కారు వచ్చీ రాగానే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం రద్దు చేయడం, మన ఊరు మన బడి ప్రోగ్రాం కొనసాగించకపోవడం, పురుగులన్నం, విషాహారంతో మధ్యాహ్న భోజనం వలన ప్రభుత్వ పాఠశాలల పరపతి తగ్గి ఎన్ రోల్మెంట్ తగ్గుతోంది. ఒక్క సంవత్సరంలోనే 6,213 ప్రభుత్వ స్కూల్స్ మూత పడే దుస్థితికి రేవంత్ సర్కారు దిగజార్చింది అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad