ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం డయాగ్నస్టిక్స్ ద్వారా 59 రకాల పరీక్షలను జిల్లా ఆసుపత్రిలలో చేస్తున్నది. 134 వైద్య పరీక్షలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలలోని టి.డయాగ్నోస్టిక్స్ లలో అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన పాథాలజీ పరీక్షలకు సంబంధించిన పాథాలజీ మిషన్ ను ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని డాక్టర్లoదరికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపారు. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని టి. డయాగ్నస్టిక్స్ సెంటర్లలో పాథాలజీ ,రేడియాలజీ ల్యాబ్లలో గతంలో ఉన్న 59 రకాల పరీక్షలకు అదనంగా 75 రకాల పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి మొత్తంగా 134 రకాల పరీక్షలను నేడు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేషేంట్లకు డాక్టర్ చూసిన తర్వాత వ్రాసే వైద్య పరీక్షల టెస్టుల యొక్క రిపోర్టులను 24 గంటల వ్యవధిలోనే తెలియజేయడం జరుగుతుందన్నారు. తద్వారా డాక్టర్లు మెరుగైన వైద్యం చేయుటకు అవకాశం ఉంటుందని అన్నారు.టి. డయాగ్నస్టిక్స్ ద్వారా 59 టెస్టులను 134 పెంచుకోవడం జరిగిందని అందులో ముఖ్యంగా ఎనిమియా ప్రొఫైల్, సర్జికల్ ప్రొఫైల్ క్యాన్సర్ కి సంబంధించిన బయాప్సీ టెస్టులు, హార్మోన్ టెస్టులు, హెచ్ఐవి , వైరల్ గ్రూప్ , యూరిన్ కల్చర్ తదితర 134 రకాల టెస్టులు ఇందులో ఉంటాయని తెలిపారు. ఇవి బయట ల్యాబ్ లల్లో అయితే వెయ్యి రూపాయల నుండి పదివేల వరకు ఖర్చు అయ్యేదని కానీ టి.డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా ప్రభుత్వం నిర్వహిస్తారని తెలిపారు. హైదరాబాదులో ఏ విధంగానైతే ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయో రాష్ట్రంలోని మారుమూల, రిమోట్ ప్రాంతాలలో నివసించే ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఇందుకు టి. డయాగ్నస్టిక్స్ ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. తద్వారా పేదప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వ వైద్యంపై ఇంకా నమ్మకం పెరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వాసుపత్రులలో అందుబాటులో తీసుకువచ్చారని అన్నారు. ఇంతకుముందు ఖర్చులకు భయపడి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా ఉండేవారని దానివలన వ్యాధి ముదిరిపోయి ప్రాణాంతకంగా మారేదని ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని అన్నారు. అన్ని టి డయాగ్నస్టిక్స్ సెంటర్లు ఎన్.ఏ.బి.హెచ్ అక్రిడేటెడ్ పొందాయని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా టి. డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా 57 లక్షల మందికి వైద్య సేవలను అందించామన్నారు. 10 కోట్ల 40 లక్షల పరీక్షలను టి. డయాగ్నొస్టిక్స్ ద్వారా చేశామని అన్నారు.
ప్రతి ఒక్కరూ పరీక్షల కొరకు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని ప్రతి పీహెచ్సీ, బస్తీ దవాఖాన నుండి శాంపిల్స్ సేకరించి వాటిని మొబిలైజేషన్ ద్వారా జిల్లా హెడ్ క్వార్టర్ లోని టి. డయాగ్నస్టిక్స్ కేంద్రాల ద్వారా పరీక్షలు నిర్వహించి డాక్టరు, పేషెంట్ కు గంటల వ్యవధిలోనే సెల్ ద్వారా సమాచారం చేరవేస్తామన్నారు. అట్టి రిపోర్ట్ లను బట్టి డాక్టర్లు పేషేంట్లకు త్వరగా చికిత్స అందించవచ్చని అన్నారు.
అధికారులు ప్రజా ప్రతినిధులు పీహెచ్సీలను తనిఖీలు చేసినప్పుడు ఓపిల రిజిస్టర్ ను పరిశీలించి టి. డయాగ్నస్టిక్స్ సెంటర్ల ద్వారా ఎంతమందికి సర్వీసు అందిస్తున్నారని పరిశీలించాలని అన్నారు. టి. డయాగ్నస్టిక్స్ ల ద్వారా ప్రజలకు పరీక్షలు జరిగి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ముఖ్యంగా మహిళలకు, గర్భిణీలకు కావలసిన అన్ని రకాల పరీక్షలను రేడియోలజీ , పాథాలజీ ల్యాబ్ ల ద్వారా అందిస్తున్నామని గవర్నమెంట్ ఆసుపత్రిలలో గతంలో 30 శాతం ఉన్న డెలివరీలు నేడు 70 శాతంగా మెరుగైనాయని అన్నారు. వైద్య అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణి లకు మెరుగైన వైద్య సేవలు అందించి ఎక్కువగా డెలివరీలు అయ్యే విధంగా చర్యలు చేపట్టి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవలను తెలియజజేసీ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ టి. డయాగ్నస్టిక్స్ ద్వారా 59 గా ఉన్న పరీక్షలను134 పరీక్షలను ప్రారంభించుకోవడం, ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలలో ఈ సేవలు అందడం చాలా సంతోషంగా ఉందని గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లాలో టి. డయాగ్నస్టిక్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులో స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నారని, ముఖ్యమంత్రి చొరవతో జిల్లాకు మెడికల్ కాలేజి, నర్సింగ్ కాలేజి వచ్చిందని అప్పటికి, ఇప్పటికీ వైద్య పరంగా జిల్లా ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందిస్తున్నారని అన్నారు.టి డయాగ్నస్టిక్స్ ద్వారా ప్రజలకు మరిన్ని విలువైన వైద్య పరీక్షలను చేయడం ద్వారా ప్రజలు మెరుగైన వైద్యసేవలు పొందేందుకు వీలు ఉంటుందని, ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్స్ డే సంధర్భంగా జిల్లాలోని వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జడ్పీ చైర్ పర్సన్ బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ. డాక్టర్ బి హరీష్ రాజ్ సూపర్డెంట్ డాక్టర్ వెంకట్ రాములు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.