Saturday, November 23, 2024
HomeతెలంగాణHarish Rao: తెలంగాణ భవితకు భరోసా.. బిఆర్ఎస్ మ్యానిఫెస్టో

Harish Rao: తెలంగాణ భవితకు భరోసా.. బిఆర్ఎస్ మ్యానిఫెస్టో

మ్యానిఫెస్టోతో బిఆర్ఎస్ గెలుపు ఖాయం

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖ‌రాల‌కు చేర్చిన మ్యానిఫెస్టో ఇది.
కేసీఆర్ బీమా, ఆరోగ్య‌శ్రీ ప‌రిమితి పెంపుతో ప్ర‌తి ఇంటికి ధీమా ఇచ్చిన మ్యానిఫెస్టో ఇది.
సౌభాగ్య ల‌క్ష్మితో ప్ర‌తి మ‌హిళ‌కు కేసీఆర్ అన్న‌గా మారిన మ్యానిఫెస్టో ఇది.
తెలంగాణ అన్న‌పూర్ణతో పేదలకు స‌న్న‌బియ్యం అందించే మ్యానిఫెస్టో ఇది.
పింఛ‌న్లు, రైతుబంధు పెంపుతో వారిలో కొండంత ధైర్యం నింపిన మ్యానిఫెస్టో ఇది.
హైద‌రాబాద్ లో మ‌రో ల‌క్ష మంది పేద‌ల ఆత్మ‌గౌర‌వాన్ని పెంచే మ్యానిఫెస్టో ఇది.
అగ్ర వర్ణ పేద విద్యార్థులకు గురుకులాల‌తో అత్యుత్త‌మ విద్య‌నందించే మ్యానిఫెస్టో ఇది
అసైన్డ్ ల్యాండ్ పై ఆంక్షల ఎత్తివేతకు చర్యల‌తో బ‌ల‌హీన‌వ‌ర్గాల‌ను ఆదుకునే మ్యానిఫెస్టో ఇది.
సిపిఎస్ ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే మ్యానిఫెస్టో ఇది.

- Advertisement -

ఇది బి ఆర్ ఎస్ మ్యానిఫెస్టో మాత్రమే కాదు. ప్రజల మ్యానిఫెస్టో. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాడించే మ్యానిఫెస్టో.

తొమ్మిదిన్న‌రేండ్లుగా ఇచ్చిన హామీలు అమ‌లు చేసి, ఇవ్వ‌ని హామీల‌ను కూడా ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ ది.
విజ‌న్‌, క‌మిట్మెంట్ ఉన్న నాయ‌కుడిగా..
ఈ హామీల‌ను సైతం వంద‌శాతం అమ‌లు చేస్తార‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు.
అందుకే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్ర‌జ‌లు సంబురాల్లో మునిగితే..
ప్ర‌తిప‌క్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయి.
సీఎం కేసీఆర్ మాస్ట‌ర్ స్ట్రోక్ తో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయాయి.
వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నది. రికార్డ్ సృష్టించబోతున్నది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News