సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో ఈత కొడుతూ ఐదుగురు యువకులు మృతి చెందడంపై స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకులు ఇలా అకాల మరణం చెండం తన మనసును కలిచివేసిందంటూ వాపోయారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ లో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందడం బాధాకరం. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందటం నా మనస్సును కలిచి వేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని ట్వీట్ చేశారు.