సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన స్పోర్ట్స్ హబ్ గా ఇలాంటి కార్యక్రమాలతో స్పూర్థిని పొంది ముందుకు పోతున్న సిద్దిపేట క్రీడల్లో రాష్ట్ర జాతియా స్థాయి పోటీలకు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం,స్విమ్మింగ్ ఫుల్ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి లో స్విమ్మింగ్ పోటీలు, వాలీ బాల్, ఫుట్ బాల్ క్రికెట్ పోటీలు సెలెక్షన్స్ కు, తెలంగాణ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సిద్దిపేట వేదిక అయిందని అన్నారు. రంగనాయక సాగర్ వేదికగా రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు జరిగాయి. ఇదే వేదికగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సిద్దిపేట అన్నింటిలో మేటి నేడు హాఫ్ మారథాన్ లో సాటి అని హాఫ్ మారథాన్ కార్యక్రమం పూనుకున్నప్పుడే అద్భుతమైన స్పందన వచ్చిందని రన్నింగ్ చేసే వారు ఇంత మంది ఉంటారా అనే ఆశ్చర్యం కలిగిందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి పునాది వేసిన సిద్దిపేట సిపి ఎన్ శ్వేతకి అభినందనలు తెలిపారు. హాఫ్ మారథాన్ భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సిపి శ్వేత కృతజ్ఞతలు తెలియజేశారు.
హాఫ్ మారథాన్ బ్రాండ్ అంబాసిడర్స్ తాడూరి శ్రీకాంత్,డా.నాగ లక్ష్మి..
హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్ యం. నాగలక్ష్మి, వయస్సు 56 సంవత్సరములు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ సిద్దిపేటలో ఆగస్టు 6న నిర్వహించే హాఫ్ మారతాన్ రన్ మద్దతుగా హైదరాబాదు నుండి రంగనాయక సాగర్ ప్రాజెక్టు వరకు 100 కె సైక్లింగ్ చేసుకుంటూ వచ్చి మహిళలలో మంచి స్ఫూర్తిని నింపారు. సిద్దిపేట జిల్లా వాస్తవ్యుడు శ్రీకాంత్ తాడూరి సిద్దిపేట హాఫ్ మారతాన్ రన్ మద్దతుగా సికింద్రాబాద్ నుండి తన మిత్ర బృందంతో కలిసి రంగనాయక సాగర్ వరకు100 కె రన్ చేసుకుంటూ వచ్చి యువకులలో మరింత ఉత్సవాన్ని నింపారు. వీరు ఇద్దరు కూడా మన హాఫ్ మారథాన్ కు అద్భుతమైన ప్రచారకులుగా నిలిచి ఎంతో స్పూర్తి నిచ్చారు. ఇలాంటి వారు నేటి తరానికి ఎంతో స్పూర్తిగా నిలుస్తారని అన్నారు.
హాఫ్ మారథాన్ లో గెలుపొందిన విజేతలు
21కె విజేతలు
మహిళా విభాగంలో
1 ఉమ, సూర్యపేట, ప్రధమ-50,000/-
- మల్లిక, నల్లగొండ ద్వితీయ-25,000/-
- వడ్డే నవ్య. తృతీయ-10,000/- పురుషుల విభాగంలో
- రమేష్ చంద్ర, రమావత్, నాగర్ కర్నూల్, ప్రథమ -50,000/-
- మోతి చౌదరి, ఉత్తర ప్రదేశ్
ద్వితీయ-25,000/- - గీయో ఆంటోనీ, నాగర్ కర్నూల్, తృతీయ-10,000/-
10 కె రన్ విజేతలు
మహిళల విభాగంలో విభాగంలో
- స్వప్న, కడావత్, నాగర్ కర్నూల్ ,ప్రధమ-25,000/-
- కావ్య, మంచిర్యాల ద్వితీయ-15,000/-
- గగన శ్రీ, హైదరాబాద్
తృతీయ-10,000/- పురుషుల విభాగంలో - సునీల్ కుమార్, మహారాష్ట్ర ప్రధమ-25,000/-
- మనీష్ రాజపుత్ర్ మహారాష్ట్ర,ద్వితీయ-15,000/-
- మహేష్, సల్ల నల్లగొండ, తృతీయ-10,000/- 5కె విజేతలు
మహిళల విభాగంలో - విశాలాక్షి, హైదరాబాద్
ప్రధమ-15,000/- - కృష్ణకుమారి, బీదర్
ద్వితీయ-10,000/- - ఆర్. కీర్తన, నలగొండ
తృతీయ-5,000/-
పురుషుల విభాగంలో విజేతలు
- అఖిల్, ప్రధమ-15,000/-
- రాంరెడ్డి, ద్వితీయ-10,000/-
- తిలక్, తృతీయ-5,000/-
విజేతలకు నగదు పురస్కారం మంత్రివర్యులు,పోలీస్ కమిషనర్,ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు.