Saturday, November 23, 2024
HomeతెలంగాణHarish Rao: సిద్ధిపేటలో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మంత్రి

Harish Rao: సిద్ధిపేటలో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మంత్రి

సిద్ధిపేటలో ఇండిపెండెన్స్ డే వేడుకలు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ను ఎగురవేసిన మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి హరీష్ రావు.

- Advertisement -

జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, భగత సింగ్‌, సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ వంటి చిరస్మరణీయులతో పాటుగా దేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ త్యాగధనులందరికీ వినమ్రమైన జోహర్లు అర్పిస్తున్నాను. వారి స్పూర్థితోనే నాటి ఉద్యమ నేత, నేటి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి నేతృత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. పసి రాష్ట్రంగా అవతరించిన పదేళ్లలోనే తెలంగాణలో నూరేళ్ల అభివృద్ధి వేళ్లూనుకుంది. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయని చెప్పడంలో నాకు ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్‌గా చెప్పుకున్న నీళ్లు, నిధులు, నియామకాలను సాకారం చేసుకున్నాం. అదే మార్గంలో సిద్దిపేట ట్యాగ్‌లైన్‌గా భావించిన జిల్లా ఏర్పాటు, గోదావరి జలాలు, రైలు సౌకర్యాన్ని సాధించుకున్నామని నేటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున చెప్పుకోవడం గర్వంగా ఉంది. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా చేపట్టిన అనేక ఆదర్శవంతమైన కార్యక్రమాలతో మన జిల్లా ముఖచిత్రం మురిసిపోతున్నది. అభివృద్ధి, సంక్షేమాలను రెండు కండ్లుగా భావించి తెలంగాణ ప్రభుత్వం మన జిల్లాలో చేపట్టిన ప్రగతిశీల సంస్కరణలను మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లా కేంద్రం.. ప్రజలకు ప్రయోజనం

తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే సిద్దిపేట జిల్లా ఆవిర్బవిస్తుందని గౌరవ కేసీఆర్‌ గారు పదేపదే ప్రస్తావించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు అన్నట్లుగానే నాలుగు దశాబ్దాల కలను సాకారం చేస్తూ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారు. వ్యయప్రయాసలతో సంగారెడ్డికి పోయివచ్చే బాధల నుండి ఈ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించారు.

జిల్లాతో పాటు గజ్వేల్‌, హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు, కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పాలనాపరమైన సంస్కరణలతో ప్రజాప్రయోజనాలకు మరింత ఊతమిచ్చినట్లయ్యింది. నాడు గంటల కొద్దీ ప్రయాణం చేసి సంగారెడ్డికి రాకపోకలు చేసినవాళ్లు నేడు నిమిషాల వ్యవధిలోనే అన్ని కార్యాలయాలకు చేరువ కావడమనేది మనం సాధించుకున్న గొప్ప విజయంగా చెప్పవచ్చు. అన్నదాతల కండ్లలో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News