Saturday, November 23, 2024
HomeతెలంగాణHarish: మీరు లేకుంటే నేను లేను..

Harish: మీరు లేకుంటే నేను లేను..

కార్యకర్తలకు కష్టం వస్తే నేను కాపాడుకుంటానంటూ..మీ ఇంటిలో తండ్రిగా, పెద్దన్నగా, మీ తమ్ముడిగా, కొడుకుగా మీ వెంట ఉంటానంటూ మంత్రి హరీష్ రావు అన్నారు. మీరు లేకుంటే నేను లేను, పార్టీ లేదని హరీష్ అన్నారు.  సిద్దిపేట జిల్లా నారాయణ రావు పేట మండలం బంజరుపల్లి బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మండల పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

- Advertisement -

ఒకప్పుడు బతుకమ్మలు వేయడానికి గుంతలు తీసి నీళ్లు పోసేవారిమని, ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా చెరువుల్లో నీళ్లున్నాయంటూ హరీష్ రావు సగర్వంగా పేర్కొన్నారు.   గతంలో కాలం కోసం ఆకాశం వైపు చూస్తే.. ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News