Wednesday, May 14, 2025
HomeతెలంగాణHarish Rao: కాంగ్రెస్ పాలనలో దేవుళ్లకు కూడా మొండిచెయ్యి: హరీశ్ రావు

Harish Rao: కాంగ్రెస్ పాలనలో దేవుళ్లకు కూడా మొండిచెయ్యి: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం దేవుళ్లకు కూడా మొండిచెయ్యి చూపించిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీప నైవేధ్యం పథకం కింద అందించే నిధులు రెండు నెలలుగా ఆగిపోయాయని ఎక్స్ వేదికగా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ధూప, దీప నైవేధ్యాలకు పైసలు లేక, అర్చకులు ఉద్దెరకు పూజ సామగ్రి తెచ్చుకుని నిత్య దైవారాధనలు చేయాల్సిన దుస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. రెండు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జనవరి నెలతో కలిపి మూడు నెలల బకాయిలు రూ.19.62కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

- Advertisement -

కాగా ధూప, దీప నైవేధ్యం స్కీమ్ కింద రాష్ట్రంలోని 6,541 ఆలయాల నిర్వాహణకు ఒక్కో ఆలయానికి ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇందులో రూ.7వేలు అర్చకుడి భృతికి, రూ.3వేలు ధూప, దీప నైవేధ్యాలకు కేటాయిస్తారు. అయితే రెండు నెలలుగా దేవాదాయశాఖ నుంచి రూ. 1.308కోట్ల మేరకు నిధులు ఆగిపోవడంతో అర్చకులు ఆలయాల నిర్వాహణలో ఇబ్బంది పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News