Thursday, June 26, 2025
HomeతెలంగాణToday Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. నిన్న ఎక్కడ చూసినా కుండపోతే..!

Today Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. నిన్న ఎక్కడ చూసినా కుండపోతే..!

- Advertisement -

TG Weather updates: జూన్‌లో వర్షాలు సరిగా ఉండవేమోనని మొదట ఆందోళనలు వ్యక్తమైనా, గత రెండు రోజులుగా తెలంగాణలో రుతుపవనాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అల్పపీడనం, వాతావరణంలో వేగవంతమైన మార్పుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నిన్న విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇది జూన్ నెల వర్షపాత అంచనాలను పూర్తిగా మార్చేసింది.

ఈ వర్షాల వల్ల చాలా జిల్లాల్లో లోటు తీరి, వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంది. ఇది తెలంగాణ వ్యవసాయానికి, నీటి అవసరాలకు ఎంతో సానుకూలంగా నిలిచింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమయంలో మంచి వర్షాలు కురవడంతో వారంతా సంతోషంగా ఉన్నారు. నేడు కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది.

భారీ వర్షపాతం నమోదు:

ఆదిలాబాద్ జిల్లాలో 100-140 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, మెదక్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్, వనపర్తి, మహబూబ్‌ నగర్ జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షాలు కురిశాయి. ఇది వ్యవసాయ రంగానికి పెద్ద ఊతం ఇచ్చింది.

రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో:
హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిన్న సాయంత్రం జారీ చేసిన రెడ్ అలర్ట్ ప్రకారం, ఉత్తర, మధ్య తెలంగాణలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో రాత్రి, ఉదయం వేళల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాలు ముఖ్యంగా ప్రభావితమయ్యాయి, అయితే ఇతర జిల్లాల్లో కూడా విస్తారంగా భారీ వర్షపాతం నమోదువ్వడం గమనార్హం.

నేడు ఈ ప్రాంతాల్లో:

గత 3-4 గంటలుగా మెదక్, సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, ప్రస్తుతం ఉత్తర తెలంగాణ, ప్రధానంగా ఆదిలాబాద్‌పై తీవ్ర వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి మరో 2-3 గంటల పాటు కొనసాగి ఆ తర్వాత తగ్గుముఖం పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర ప్రాంతాల్లో వచ్చే 2 గంటల్లో తేలికపాటి వర్షాలు లేదా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News