Rains Alerts to Telangana: నేటి నుండి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాలు పిడుగులతో కూడి ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Advertisement -
కింది జిల్లాలలో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది:
ఆదిలాబాద్
భద్రాద్రి కొత్తగూడెం
హన్మకొండ
జగిత్యాల
జనగామ
జయశంకర్ భూపాలపల్లి
కామారెడ్డి
కరీంనగర్
ఖమ్మం
కుమ్రం భీం ఆసిఫాబాద్
మహబూబాబాద్
మంచిర్యాల
మెదక్
ములుగు
నిర్మల్
నిజామాబాద్
పెద్దపల్లి
సిరిసిల్ల
రంగారెడ్డి
సంగారెడ్డి
వికారాబాద్
వరంగల్
భువనగిరి
ప్రజలు ఈ వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.


