Friday, September 20, 2024
HomeతెలంగాణHC on Jeevan Reddy: జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

HC on Jeevan Reddy: జీవన్ రెడ్డి, కుటుంబ సభ్యులను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

అక్రమ కేసులతో కక్ష సాధింపు: జీవన్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు చేయొద్దు అంటూ సోమవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై, ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన అక్రమ కేసులలో భాగంగా జీవన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అనుచరులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ధర్మం గెలిచింది.. న్యాయం గెలిచింది అంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేశారు.

- Advertisement -

ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి లో తనకు చెందిన 76 ఎకరాల భూమిపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని చూస్తున్నారని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నా కుటుంబ సభ్యులైన నా భార్య రజిత రెడ్డి, అమ్మ రాజు భాయి లతో పాటు ఇతర కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి సాధింపు చర్యలు చేపట్టాలని చూస్తున్నారని జీవన్ రెడ్డి వాపోయారు. ఈ అక్రమ కేసుల విషయంలో రాష్ట్ర హైకోర్టు తనను తన కుటుంబ సభ్యులను అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు నెరవేరలేదని, హైకోర్టు తమను ఏమి చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు జీవన్ రెడ్డి వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News