Tuesday, September 10, 2024
Homeపాలిటిక్స్KTR fire on CM Revanth: ప్రజాపాలనా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలనా !

KTR fire on CM Revanth: ప్రజాపాలనా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలనా !

కేటీఆర్ ట్వీట్

ఇది ప్రజాపాలన కాదు..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన..

- Advertisement -

కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు..
కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు..
కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు

చివరికి..
నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు

సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే..
కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత..

సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది
ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది

మిషన్ భగీరథ పథకంతో..
దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే..
కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది

గుర్తుంచుకోండి..
జలమే జగతికి మూలం..

ఈ సర్కారు తీరు మారకపోతే…
జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయం…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News