Saturday, November 15, 2025
HomeతెలంగాణGST: కొత్త జీఎస్టీ.. చారిత్రక నిర్ణయం

GST: కొత్త జీఎస్టీ.. చారిత్రక నిర్ణయం

GST: న్యూఢిల్లీలో జరిగిన 56వ వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశంలో, సామాన్యులు, రైతులు, మధ్యతరగతి, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కలిగించేలా జీఎస్టీ శ్లాబ్‌లను సులభతరం చేసి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ రాంచందర్ రావు అన్నారు. ఈ మేరకు గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

‘దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మేలు జరిగేలా జీఎస్టీ ట్యాక్స్ తగ్గిస్తూ, జీఎస్టీ కౌన్సిల్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 12%, 28% పన్నుశ్లాబ్ లను పూర్తిగా రద్దు చేసింది. 12% శ్లాబ్ రద్దు చేయడంతో, ఆ పరిధిలో ఉన్న అనేక నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% శ్లాబ్ లలోకి రానున్నాయి. మరికొన్ని వస్తువులపై జీఎస్టీ శాతం జీరోకు తగ్గించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో, జీఎస్టీ రేట్ల తగ్గింపు ద్వారా సామాన్యులు, రైతులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు నేరుగా ఆర్థిక ఊరట కల్పిస్తోంది. ఇది చారిత్రాత్మక నిర్ణయం’ అన్నారు.

ALSO READ: https://teluguprabha.net/national-news/gst-benefits-to-commanman/

మోడీ ప్రభుత్వం వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల వేళ బహుమతిగా.. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై ట్యాక్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ స్వాగతిస్తూ, ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

‘మోడీ ప్రభుత్వం వన్ నేషన్-వన్ టాక్స్, వన్ నేషన్-వన్ లా వంటి సంస్కరణలు తీసుకువచ్చింది.
ఇప్పటివరకు అమలులో వున్న బ్రిటీష్ చట్టాల స్థానంలో కేంద్రం కొత్త చట్టాలను తీసుకొచ్చింది.
బ్రిటీషర్ల కాలంలో భారతదేశంలో రకరకాల టాక్స్‌లు విధించి పేదప్రజలపై భారం మోపారు. జీఎస్టీ ద్వారా వ్యాట్, ఎక్సైజ్ వంటి వాటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి, దేశవ్యాప్తంగా సులభమైన టాక్స్ వ్యవస్థ అమలు చేసింది. భారతదేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దేశ అభివృద్ధి కార్యక్రమాలకు వనరులు లభిస్తున్నాయి. ప్రపంచంలోనే భారత్ త్వరలో 5 ట్రిలియన్ ఎకానమీని చేరే దిశలో ఉంది. కేంద్రం 56వ జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ సులభతరం, రేట్ల తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకుంది. దసరా, దీపావళికి ముందే పండుగ సరుకులు ప్రజలకు అగ్గువకే లభించనున్నాయి. పాలు, పనీర్‌, హేర్ ఆయిల్, పాల ఉత్పత్తులు, టూత్ బ్రష్‌లు, సబ్బులు, షాంపూలపై జీఎస్టీ తగ్గింపు జరిగింది. పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసర వస్తువులపై 18% నుండి 5%, కొన్నింటిపై 12% నుండి 5%, మరికొన్ని జీరో శాతానికి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయం’ అని గుర్తు చేశారు.

అమెరికా విధించే టారిఫ్ వల్ల ప్రపంచ దేశాలు భయపడుతున్నా, భారత్ మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా కాంకెప్ట్‌ను ముందుకు తీసుకుని జీఎస్టీ రేట్లు తగ్గించిందన్నారు. దీని ఫలితంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం కలిగిందన్నారు.

మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌తో జీఎస్టీ తగ్గించడం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం జరుగుతోంది.

‘తెలంగాణలో యూరియా కృత్రిమ కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తోంది. మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అవసరమైన యూరియాను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ ను అడ్డుకోలేకపోతోంది’ అని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad