హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ నుండి భారీ ర్యాలీగా, నియోజకవర్గం నలుమూలలు,పలు గ్రామాల నుండి వేలాదిమంది గులాబీ శ్రేణులు వెంటరాగా, గాంధీ చౌరస్తా, మల్లె చెట్టు చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా హుస్నాబాద్ ఐఓసి కార్యాలయానికి చేరుకొని హుస్నాబాద్ ఆర్డిఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి బెనిషాలోమ్ సమక్షంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సతీష్ కుమార్-డాక్టర్ షమిత దంపతులు అనంతరం సతీష్ కుమార్ తల్లిదండ్రులు మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు- సరోజనదేవి ల ఆశీర్వాదం తీసుకొని, సతీష్ కుమార్ కుమారుడు ఇంద్రనీల్, ఇతర కుటుంబ సభ్యులు తరలి రాగా భారీ ర్యాలీగా తరలి వెళ్లి నామినేషన్ వేశారు.
హుస్నాబాద్ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ దేశంలో కేసీఆర్ లాంటి నాయకుడు లేడని, అభివృద్ధి సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని దేశంలో అన్ని రంగాలలో తెలంగాణ నెం.1స్థానంలో దూసుకుపోతుందని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించుకోవాలని ప్రతిపక్షాల పార్టీలకుఅభ్యర్థులు కరువయ్యారని, వారి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదు, ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి మళ్లీ వస్తున్నారు వాళ్ళ భ్రమలో పడవద్దని ప్రజలకు సూచించారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల వారు అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే సతీష్ కుమార్ వేలకోట్లతో అభివృద్ధి చేశారని, అలాంటి సతీష్ కుమార్ ను మరొకసారి ఆశీర్వదించి హుస్నాబాద్ ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసిఆర్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని, ప్రతిపక్షాలు కాళ్లల్లో కట్టే పెట్టి అభివృద్ధి నిరోధకులుగా మారారని, ఆనాడు తెలంగాణ గురించి కేసిఆర్, తెలంగాణ ప్రజానీకం, యువకులందరూ కొట్లాడుతూ ఉంటే తెలంగాణ వచ్చేదా, చచ్చేదా అని హేళన చేసిన వారు ఇప్పుడు వచ్చి మేము అభివృద్ధి చేస్తామనడం ఆశ్చర్యంగా ఉందని, వారి మాయ మాటలు నమ్మవద్దని తెలంగాణను చీకట్లోకి నెట్టవద్దని ప్రజలకు సూచించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ గత తొమ్మిది ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చేశారని, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశారని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగించుకోవాలని గతంలో ఉన్న కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఏమీ చేయలేదని ఇప్పుడు మేము ప్రజలకు సేవ చేస్తామని వస్తున్నారు జాగ్రత్త ప్రజలందరూ వారి మాటలు నమ్మవద్దు. అభివృద్ధి కాముకుడు, నిత్యం ప్రజల శ్రేయస్సుకై తపించే నాయకుడు సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలిపారు.
ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా 9 ఏండ్లలో నియోజకవర్గాన్ని 9,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో ఘననీయంగా అభివృద్ధి చేశానని, అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం, అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మత్తులు, పల్లె ప్రకృతి వనాలు వైకుంఠధామాలు, బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలు, మోడల్ స్కూల్లు, పల్లె దవఖానాలు, హుస్నాబాద్ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసుకున్నామని, హుస్నాబాద్ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామని, గొర్రెల పంపిణీ కార్యక్రమం, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఇలా అనేక పథకాలు, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాయని, ప్రతిపక్ష పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఎలక్షన్ టూరిస్టులు వస్తూ ఉంటారు, పోతుంటారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల మధ్య ఎల్లప్పుడూ నేను ఉంటా అని అన్నారు, రానున్న రోజుల్లో ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని,హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలియజేస్తూ, హుస్నాబాద్ ప్రజలందరూ అభివృద్ధిని చూసి మరొకసారి ఆశీర్వదించాలని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును ఎన్నికల తరువాత ప్రారంభిస్తామని తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ మండల ఎంపీపీలు జడ్పిటిసిలు మండల అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అభిమానులకు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి భారీగా హాజరైన గులాబీ శ్రేణులు, మహిళలు యువకులు, ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్.