Saturday, November 23, 2024
HomeతెలంగాణSatish got ticket: ఊహించిందే.. జరిగింది

Satish got ticket: ఊహించిందే.. జరిగింది

హుస్నాబాద్ గులాబీ అభ్యర్థిగా మళ్ళీ సతీష్

అందరు ఊహించిందే జరిగింది. హుస్నాబాద్ బీఆర్ ఎస్ అభ్యర్థిత్వం మళ్ళీ వొడితల సతీష్ కుమార్ కే దక్కింది. మూడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో గులాబీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మరోసారి నిలవబోతున్నారు. 2014 ఎన్నికల్లో 34 వేల మెజారిటీతో, 2018 ఎన్నికల్లో 70 వేల మెజారిటీతో సతీష్ కుమార్ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి
వొడితల సతీష్ కుమార్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. సతీష్ పెదనాన్న స్వర్గీయ సింగాపురం రాజేశ్వర్ రావు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేయగా, సతీష్ తండ్రి కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు సిఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ఉన్నారు. సతీష్ కుమార్ తండ్రి కెప్టెన్ ఎమ్మెల్యేగా మంత్రిగా అలాగే రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. సతీష్ కుమార్ సింగాపురం గ్రామ సర్పంచిగా, తుమ్మనపల్లి సింగిల్ విండో అధ్యక్షునిగా పనిచేసారు. హుజురాబాద్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సింగాపురం కిట్స్, వరంగల్ కిట్స్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో లయన్స్ క్లబ్ లో వివిధ స్థాయిల్లో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 2012 లో హుజురాబాద్ బీ ఆర్ ఎస్ ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టి పల్లె బాట కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ జెడ్పిటీసీ, ఎంపిటిసి, సర్పంచ్, సింగిల్ విండో స్థానాలు పార్టీ అభ్యర్థులు గెలుచుకునేలా కృషి చేసారు. 2014, 2018 ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా హుస్నాబాద్ నుండి విజయదుంధిబి మోగించారు.
మూడోసారి బరిలోకి
హుస్నాబాద్ గులాబీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మూడోసారి బరిలో నిలవబోతున్నారు. ఏ పార్టీకి లేని కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల బలం హుస్నాబాద్ నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీకి ఉంది. దాదాపు 85 వేల రైతుబంధు లబ్ధిదారులు, 45 వేల ఆసరా పింఛన్ల లబ్ధిదారులు, 12 వేల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు మరో పదివేల ఇతర పథకాల లబ్దిదారులు బీ ఆర్ ఎస్ పార్టీకి మద్దతుగా ఉంటారనే ఆశాభావం ఉంది. సతీష్ కుమార్ ఎవరికీ హాని చేయరని, అవినీతి, అక్రమాలు మచ్చుకైనా ఉండవని, అందరిని రిసీవ్ చేసుకుంటారనే పేరుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీకి లేని, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల బలం బీ ఆర్ ఎస్ పార్టీకి ఉంది.
అభివృద్ధి విషయంలోనూ..
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శక్తివంచన లేకుండా కృషి చేసారు. సతీష్ కుమార్ హయాంలో సి ఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుల సహకారంతో అతిపెద్ద 9 టిఎంసి ల సామర్థ్యం కలిగిన, మెట్ట ప్రాంత రైతాంగ చిరకాల వాంఛ అయినా గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి చేసారు. మిడ్ మానేరు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు తీసుకువచ్చారు. కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లు తీసుకువచ్చారు. హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ గా చేశారు. పాలిటెక్నిక్ కళాశాలను తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలను కళాశాలలకు భవనాలను నిర్మించారు. ఇటీవలే ఇండోర్ గేమ్స్ కాంప్లెక్స్ ప్రారంభమైంది. ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. త్వరలోనే ప్రారంభం కానుంది. పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎల్లమ్మ చెరువు సుందరి కరణ పనులు జరిగాయి. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. గతంలో అభివృద్ధికి దూరంగా ఉన్న హుస్నాబాద్ లో అన్ని రంగాల్లో తీర్చిదిద్దే ప్రయత్నం సతీష్ కుమార్ చేశారు. రాజకీయంగా కూడా ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టారు. అన్ని రంగాల్లో హుస్నాబాద్ ను తీర్చిదిద్దారు.

- Advertisement -

గెలుపుపై ధీమా
హుస్నాబాద్ నియోజకవర్గంలో మరోసారి సతీష్ కుమార్ భారీ మెజారిటీ విజయఢంకా మోగించడం ఖాయమని బీ ఆర్ ఎస్, సతీష్ కుమార్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో బీ ఆర్ ఎస్ అధినేత, సి ఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన అనంతరం బీ ఆర్ ఎస్ శ్రేణులు స్వీట్లు పంచి బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News