Sunday, October 6, 2024
HomeతెలంగాణHuzurabad: బీఆర్ఎస్ లోకి చేరికలు

Huzurabad: బీఆర్ఎస్ లోకి చేరికలు

బీజేపీ నుంచి 500 మంది బీఆర్ఎస్ లోకి చేరిక

హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చల్లూరు శేఖర్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కులస్తులు, బిజెపి పార్టీకి చెందిన సుమారు 500 మంది బిజెపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ప్రమాణం చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేస్తామని తీర్మానం చేసుకున్నారు. తీర్మానం ప్రతిని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రూపంలో చేరుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం ప్రధాత అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలననే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వందకు పైగా స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని, నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు ఉంచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. నియోజవర్గ పరిధిలోని ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. తాను హుజురాబాద్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News