Saturday, November 23, 2024
HomeతెలంగాణHuzurabad: 20 ఏళ్ల జర్నలిస్టుల కల నెరవేరిన వేళ

Huzurabad: 20 ఏళ్ల జర్నలిస్టుల కల నెరవేరిన వేళ

జర్నలిస్టుల కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనుకున్నా-కౌశిక్

20 ఏళ్ల కల నెరవేరిన వేళ జర్నలిస్టుల కుటుంబాల్లో ఆనందోత్సవం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జర్నలిస్టులు. గత 20 సంవత్సరాలుగా హుజురాబాద్ జర్నలిస్టుల కల కు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్, పాడి కౌశిక్ రెడ్డి రూపంలో కల నెరవేరింది. సంవత్సరాలుగా నివేషణ స్థలాల కోసం ఎన్నో ఎదురుచూపులకు నేనున్నానంటూ మీ కల నేను సహకారం చేస్తానంటూ అన్నమాటకు కట్టుబడి జర్నలిస్టులకు నివేషణ స్థలాల పట్టాలు అందించారు. హుజరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో జర్నలిస్టులకు నివేషణ స్థలాల పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… జర్నలిస్టులో కుటుంబాల స్థితిగతులు తనకు తెలుసని వారు నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ఎలాంటి వేతనాలు లేకుండా సేవలు అందిస్తారని అన్నారు.

- Advertisement -

ఇక్కడ ఒకే ఒక ప్రజా ప్రతినిధి గత 20 ఏళ్లుగా ఉన్నప్పటికీ ఏనాడు జర్నలిస్టుల సమస్య పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. జర్నలిస్టుల కనీస అవసరమైన నివేషణ స్థలాలు కూడా కేటాయింపుపై నిర్లక్ష్యం వ్యవహరించారని అన్నారు. జర్నలిస్టుల కుటుంబాల్లో సంతోషం చూడాలనుకున్నాను అందుకే సాధ్యమైనంత త్వరగా వారికి నివేషణ స్థలాలు అందించానని అన్నారు. కొన్నేళ్లుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించానని, ఒక్క అవకాశం కల్పిస్తే ఐదు సంవత్సరాల్లో హుజురాబాద్ ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.


ఎమ్మెల్సీకి జర్నలిస్టుల ప్రత్యేక కృతజ్ఞతలు…
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ని నివేశన స్థలాల కోసం అడిగిన వెంటనే తప్పక సమస్య పరిష్కరిస్తానని చెప్పి తమ సమస్య పరిష్కరించినందుకు జర్నలిస్ట్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రజా ప్రతినిధి ఎన్నిసార్లు తమ గోస చెప్పుకున్న పట్టించుకోలేదని, జర్నలిస్టుల సమస్య పట్టించుకోని ప్రజా ప్రతినిధి ప్రజల సమస్యలు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. కొన్ని ఏళ్లుగా తమ సమస్య పరిష్కరించాలంటూ ఎన్నిసార్లు చెప్పులు అరిగేలా తిరిగినా చూద్దాం చేద్దాం అంటూ దాటే సమాధానాలు చెప్పారు తప్పా సమస్య పరిష్కారానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News