మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తోపాటు ఈటల రాజేందర్ సతీమణి జమునా రెడ్డి తరఫున వారి అనుచరులు వేరువేరుగా నామినేషన్లను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈనెల 9న ఈటల రాజేందర్ బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనుండగా ముందస్తుగా తన అనుచరులతో మంగళవారం నామినేషన్ వేయించారు.