హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న విగ్రహం ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు నిర్ణయించిన నేపథ్యంలో ఆయన సూచనల మేరకు పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ విగ్రహ ప్రారంభోత్సవానికి దేశంలోని పలువురు ప్రముఖులు రానున్నారు. తానే స్వయంగా ప్రతిరోజూ రోజువారీ పనులు మానిటరింగ్ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. కోట్ల మంది భారతీయుల హృదయాలకు హత్తుకునే నిర్మాణం కాబట్టి ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేయాలి. ఏప్రిల్ 5 లోపు అన్ని రకాల పనులు పూర్తి కావాలని మంత్రి అదికారులకు, వర్క్స్ ఏజెన్సీకి స్పష్టం చేశారు.