Monday, November 17, 2025
HomeతెలంగాణHyd: సీఎం సహాయ నిధి పెద్ద వరం

Hyd: సీఎం సహాయ నిధి పెద్ద వరం

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుంది

పేద ప్రజలకు మంత్రి సహాయ నిధి దేవుడు ప్రత్యక్షమై ప్రసాదించిన వరం లాంటిదని ఎల్బీనగర్ దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్రబోస్ కాలునికి చెందిన సాంబమూర్తి యొక్క కిడ్నీలకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్న తరుణంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని సంప్రదించి ఆదుకోవాలని వేడుకొన్నారు. ఎమ్మెల్యే హృదయం చలించి తక్షణమే స్పందించి ఆపరేషన్ కు కావలసిన ఆర్థిక వివరాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సాంబమూర్తికి 2లక్షల 50 వేలు రూపాయల ఎల్ ఓ సి మంజూరు కావడంతో కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధికిలోకి రాని వైద్య చికిత్సలను చేయించుకున్న వారి ఇబ్బందులను తొలగించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా పేద ప్రజల ఇక్కట్లు దూరమైతాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని వివరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరంగా పాటుపడతానని తెలిపారు .ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు చెన్నాగోని శ్రీధర్ గౌడ్, పల్ల కొండ శ్రీనివాస్ .విజయ్. భాస్కర్ రెడ్డి. ఉప్పలయ్య, దశరథ్ ,రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad