మారుతున్న వాతారవరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఆహార భద్రత, జీవవైవిధ్యం, సన్న, చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్టభూముల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఇక్రిసాట్ పేర్కొంది. ఈ పరిస్థితులలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు మెట్టభూముల పరిస్థితిని మెరుగుపరిచి సుస్థిర వ్యవసాయానికి దారులు వేయాలని, అందులో భాగంగా జరిగే పరిశోధన ఫలితాలు దీర్ఘకాలం పాటు వాతావరణ పరిస్థితులను మారుస్తూ జీవవైవిధ్యాన్ని కాపాడుతూ సహజ వనరులను సంరక్షించాలన్నారు ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు.
రాబోయే కాలంలో మెట్టభూములు మెరుగు పరిచేందుకు నూతన సాంకేతికతను సృష్టించేందుకు ఈ సదస్సు తోడ్పడుతుందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో మెట్ట భూములు మెరుగు పరిచే అంశం మీద సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు.