బధిరుల ఆశాజ్యోతి హెలెన్ కెల్లర్ 143వ జయంతి సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హెలెన్ కెల్లర్ విద్యా సంస్థలు, NPRD,TASLPA ఆధ్వర్యంలో “వినికిడి లోపం, ఆటిజం, మానసిక వైకల్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై స్మారక సెమినార్” జరిగింది. వికలాంగుల వాయిస్ మాస పత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వినికిడి లోపం, మానసిక వైకల్యం కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారని దాని నివారణ కోసం మానసిక సమస్యల పెరుగుదలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వికలాంగుల సామజిక భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల డైరెక్టర్ ఏం శశిధర్ రెడ్డి, తెలంగాణ ఆడియలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పాతలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె నాగేందర్, ఇమధ్ ఖాన్ రుమాని, క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీ పూజ సిద్ధంశెట్టి, ప్రముఖ ఆడియలాజిస్ట్ సుజన్, NPRD రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, ఏం అడివయ్య, కేంద్ర కమిటీ సభ్యులు అర్ వెంకటేష్, జే రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యశోద, రాష్ట్ర సహాయ కార్యదర్శలు ఉపేందర్, దశరథ్, బాలిశ్వర్ పాల్గొన్నారు.