ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ మేధావులు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రేవంత్ రెడ్డి చూపిన చొరవకు ధన్యవాదాలు తెలియజేశారు.
- Advertisement -
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, ఓయూ వీసీ ప్రొఫెసర్. ఎం, కుమార్ , ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్. సి. కాశీం, ప్రొఫెసర్. గడ్డం మల్లేశం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేష్ ఉన్నారు.

