MICE TOURISM లో దుబాయ్, ప్యారిస్, లండన్, మేల్ బోర్న్, సిడ్ని, న్యూయార్క్ నగరాలతో హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా పోటీపడుతోంది. HCVB జనరల్ బాడీ సమావేశంలో ఈ విషయాన్ని రాష్ట్ర టూరిజం శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో టూరిజం ప్రమోషన్ ను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన Hyderabad Convention Visitors Bureau (HCVB) జనరల్ బాడీ సమావేశంలో ఆయన వెల్లడించారు. MICE TOURISM క్యాపిటల్ గా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామన్నారు. HCVB ద్వారా నేటి వరకు 44 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లను హైదరాబాద్ నగరం లో జరిగేలా కృషి చేసినట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కి Single Window Policy ని ప్రవేశపెట్టి TOURISM అభివృద్ధికి చేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ సిటీ ఐటీ, HOTEL, ఫార్మా, మెడికల్ టూరిజం హబ్ గా ఇప్పటికే పేరు సాధించిందన్నారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో large meetings, Trade shows and conventions లను Hyderabad నిర్వహించేలా అంతర్జాతీయ స్థాయిలో టూరిజం ప్రమోషన్ ను నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్థాయిలో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటిని టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
HCVB ద్వారా రాష్ట్రంలో పర్యాటకుల సౌలభ్యం కోసం పర్యాటక ప్రదేశాలు, హోటల్ సమాచారాలు, కన్వెన్షన్ ఫెసిలిటీస్, లాడ్జింగ్, డైనింగ్, సిటీ అట్రాక్షన్స్, ఈవెంట్స్ , మ్యూజియమ్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ రిక్రియేషన్ లపై మ్యాప్స్ , బ్రోచర్స్, విజిటర్స్ గైడ్స్, సావనీర్లను రూపొందించాలని మంత్రి HCVB అధికారులను ఆదేశించారు.