హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పారామం పక్కన ఉమన్ & చైల్డ్ కోసం ప్రత్యేకంగా, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్ ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ & మానిటరింగ్ కమీషన్ చైర్మన్ రామలింగేశ్వర రావు, హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్, మాజీ DGP అనురాగ్ శర్మ, TSRTC MD సజ్జనార్, శేరిలింగంపల్లి నియోజకవర్గం BRS కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మెడికవర్ గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా అనిల్ కృష్ణ, పీడియాట్రిక్స్ & నియోనాటాలజీ డాక్టర్ పరిగే రవీందర్ రెడ్డి, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ…
మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ తక్కువ కాలంలోనే ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత సేవలను అందిస్తూ ప్రజల మన్నలను పొందటం హర్షించతగ్గ విషయం అన్నారు. స్థాపించిన అతి కొద్దికాలంలోనే 25 హాస్పిటల్స్ కి విస్తరించడం చాలా గర్వించతగ్గ విషయమన్నారు. మారుతున్న జీవనశైలి వల్ల అనేక అనారోగ్య సమస్యలని పుట్టబోయే శిశువులు, పుట్టిన శిశువులు , చిన్నపిల్లలు, పెద్దవారు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ హాస్పిటల్ని స్త్రీలకి మరియు చిన్నపిల్లలకు అత్యాధునిక సదుపాయాలతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నిర్మించడం చాలా సంతోషించదగ్గ విషయం అన్నారు.