Saturday, September 21, 2024
HomeతెలంగాణHyd: RTC ఉద్యోగుల పనితీరుపై పరిశోధన

Hyd: RTC ఉద్యోగుల పనితీరుపై పరిశోధన

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్టీయూ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.సూర్య కిరణ్‌కు డాక్టరేట్‌ లభించింది. ‘మార్కెట్‌ ధోరణి-టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పనితీరు’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) డాక్టరేట్‌ను బుధవారం అందించింది. నిట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగ అసోసియేట్‌ ఫ్రొఫెసర్‌ ప్రాన్సిస్‌ సుధాకర్‌ పర్యవేక్షణలో ఈ పరిశోధనను సూర్యకిరణ్‌ పూర్తి చేశారు. 1992లో ఆర్టీసీలో చేరిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో డీఎం, డీవీఎం, ఆర్‌ఎం, తదితర హోదాల్లో పనిచేశారు. టీఎస్‌ఆర్టీసీ చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌(సీపీఎం)గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై న్యూఢిల్లీలోని ఏఎస్‌ఆర్టీయూ ఈడీతో పాటు సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (సీఐఆర్టీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

- Advertisement -

నిట్‌ తనకు డాక్టరేట్‌ను అందించడంతో హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ను సూర్యకిరణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టరేట్‌ ప్రతిని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్‌ను సజ్జనర్‌ అభినందించారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల పనితీరుపై పరిశోధన చేయడం ప్రశంసనీయమన్నారు. వరంగల్‌ నిట్‌తో టీఎస్‌ఆర్టీసీ చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా సంస్థ అధికారులకు పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తున్నారని సజ్జనర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News