Sunday, October 6, 2024
HomeతెలంగాణSeed Ganesha: ఆలోచింపచేసే 'సీడ్ గణేష'

Seed Ganesha: ఆలోచింపచేసే ‘సీడ్ గణేష’

విస్తృతంగా మట్టి గణపతిపై ప్రచార కార్యక్రమాలు

గ్రీన్ ఇండియా వ్యవస్థాపకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా కొనసాగిస్తున్న పార్లమెంట్  సభ్యుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సీడ్ గణేషా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  పర్యావరణ హితమైన వినాయకుడిని పూజించాలని, పచ్చదనం పెంపొందించేందుకు తమవంతు పాత్ర పోషించాలని ఈ సందర్భంగా సంతోష్ పిలుపునిచ్చారు.  

- Advertisement -

హైదరాబాద్ కూకట్పల్లిలోని నెక్సస్ షాపింగ్ మాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, తెలుగుప్రభ దినపత్రిక ఎడిటర్ ఎస్ఎం చంద్రశేఖర్ శర్మ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటిన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించటం విశేషం.

  మట్టితో చేసిన ఈ గణేష్ ప్రతిమలను పూజ అయ్యాక నిమజ్జనం చేయకుండా కోకోపీట్ తో చేసిన కుండీలో వేసి, నీళ్లు పోస్తే మట్టి అంతా కరిగి, అందులోని విత్తనంతో కొత్త మొక్క వస్తుందని సీడ్  ఇండియా కార్యక్రమ నిర్వాహకులు వివరించారు.   గో రూరల్ ఇండియా అనే సంస్థ ఆధ్వర్యంలో సీడ్ గణేషా కార్యక్రమాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News