Sunday, November 16, 2025
HomeతెలంగాణHyd: పార్లమెంటులో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలి

Hyd: పార్లమెంటులో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలి

గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి పాల్గొన్నారు. 50 ఏళ్లుగా కేంద్రం గిరిజను రిజర్వేషన్ పెంచకుండా గిరిజనుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. దేశవ్యాప్తంగా గిరిజన రిజర్వేషన్ అమలై 56 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ ఏడున్నర శాతమే అమలు చేస్తూ గిరిజనులకు కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. గిరిజనుల పట్ల కేంద్రానికి ఏమాత్రం ప్రేమ ఉన్న ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad