Thursday, June 12, 2025
HomeతెలంగాణHyd: శ్రీరామనవమి వేడుకల్లో కూన శ్రీశైలం గౌడ్

Hyd: శ్రీరామనవమి వేడుకల్లో కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, జగద్గిరి గుట్ట, గాజులరామారం డివిజన్లలోని పలు ఆలయాలు, కాలనీల్లో శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు హాజరై, సీతారాముల దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ ఆదర్శమూర్తి శ్రీరాముని జీవన విధానం నుండి తరతరాలుగా ప్రజలు ప్రేరణ పొందుతున్నారని అన్నారు. ఆ సీతారాముల అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక బిజెపి నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News