తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, సుందరమైన జలపాతాలు, దేవాలయాలు అడవులు వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని ఈ ప్రాంతాల్లో సినిమా షూటింగులు జరపాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ పర్యాటక కేంద్రాలలో నామమాత్రపు ధరలకు సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇస్తున్నట్టు.. సినిమాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా చూపాలన్నారు. తెలంగాణకు చెందిన కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
తెలంగాణ నుండి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికైన నిర్మాత డాక్టర్ ప్రతాప్ రామకృష్ణ గౌడ్ ను శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు.