Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: హోలీ వేడుకల్లో తలసాని

Hyd: హోలీ వేడుకల్లో తలసాని

సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన హోలో వేడుకల్లో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు నాగులు ఆధ్వర్యంలో మోండా మార్కెట్ డివిజన్ బండిమెట్ లో జరిగిన వేడుకలకు మంత్రి హాజరు కాగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. అనంతరం పీవీ మార్గ్ లోని పీపుల్స్ ప్లాజా, సికింద్రాబాద్ లోని జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. యువతతో కలిసి డ్యాన్సులు వేస్తూ పండుగను సందడిగా జరుపుకున్నారు. ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాల్లో నూతన వసంతాలను తీసుకురావాలని కాంక్షించారు. ప్రతిఒక్కరూ ఆనందంగా గడపాలని కోరుకున్నారు. మంత్రితో పాటు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News