టీఎన్జీఓస్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల సెంట్రల్ ఫోరమ్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన డిపార్ట్మెంట్ సెంట్రల్ ఫోరమ్ కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు. 23 జిల్లాలకు సంబంధించిన పోస్టుల మంజూరు, అంగన్వాడీ సమస్యలను సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హమీనిచ్చారు. అనంతరం వారు మంత్రిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.