వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన, హైదరాబాద్ లో స్థిరపడిన పలువురు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మద్దతు పలికారు. దసరా పండుగ కోసం గ్రామానికి వచ్చిన వాళ్ళు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వత గిరికి ప్రత్యేకంగా వెళ్ళి, కలిసి, వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు మంత్రికేనని వారు అన్నారు.
మంత్రి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధికి వారు ఫిదా అయ్యారు. మంత్రిని కలిసిన వారిలో ఆరెగూడెమ్ కు చెందిన ఇటిక్యాల సుమన్, కడుదుల వెంకటేష్, సురవు ప్రవీణ్, ఎంగిలి అనిల్, వరికాల రామకృష్ణ, ఇటిక్యాల హరీష్, గుల్లపెల్లి ప్రసాద్, తుమ్మరపెల్లీ రంజిత్, పెండ్లి సుధాకర్, గాజులపాటి నర్మద, తోట సుదర్శన్, కడుదుల సురేష్ తదితరులు ఉన్నారు.