Saturday, November 23, 2024
HomeతెలంగాణHyd: మహిళా జర్నలిస్టులను అభినందించిన డీజీపీ

Hyd: మహిళా జర్నలిస్టులను అభినందించిన డీజీపీ

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ గ్రూప్ లకు చెందిన పలువురు మహిళా జర్నలిస్టులను డీజీపీ అంజనీ కుమార్ నేడు అభినందించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా డీజీపీ కార్యాలయంలో పలువురు మహిళా జర్నలిస్టులతో భేటీ అయ్యారు. అడిషనల్ డీజీ లు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, ఐజి లు చంద్ర శేఖర్ రెడ్డి, తరుణ్ జోషి, డీఐజీ ఎం. రమేష్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఇటీవల కొన్ని సంవత్సరాలుగా మహిళల నియామకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. పురుష పోలీస్ అధికారులతో పోటీ పడి విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీస్ అధికారులు అందిస్తున్న ఉత్తమ సేవలను మీడియా ద్వారా ప్రాచుర్యం కల్పించాలని పేర్కొన్నారు. తద్వారా, యువతులకు స్ఫూర్తి దాయకంగా ఉండి పోలీస్ శాఖలో చేరడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

- Advertisement -

ఈ సందర్బంగా పలువురు జర్నలిస్టులు, జర్నలిజం రంగంలో మహిళా జర్నలిస్టుల వర్కింగ్ విధానాలు, జెండర్ ఈక్వాలిటీ, వేధింపుల నిరోధానికి ఉన్న అంతర్గత కమిటీల పనితీరు తదితర అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్బంగా కోవిడ్-2 ను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను తెలియ చేసే కాఫీ టేబుల్ బుక్ ను జర్నలిస్టులకు డీజీపీ అంజనీ కుమార్ బహూకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News